తెలంగాణ

బుగ్గ సంస్కృతికి స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: బ్రిటీషు కాలం నుంచి ఆనవాయితీగా విఐపి కార్లకు ఉన్న ఎర్ర బుగ్గల సంస్కృతి అంతమైంది. విఐపిలు ఎర్ర బుగ్గలు వాడరాదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. విఐపిలు తమ కార్లకు ఎర్ర బుగ్గలు పెట్టుకోరాదని గత నెల 18న కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఎర్ర బుగ్గలు వాడేందుకు వీలు లేదు. రాష్టప్రతి నుంచి మొదలుకుని ఉప రాష్టప్రతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభృతుల వివిఐపిల కార్లకు ఎర్ర బుగ్గలు ఇకమీదట కనిపించవు. కాగా పోలీసు వాహనాలకు ఎర్ర బుగ్గ అమర్చుకోవడానికి కేంద్రం అనుమతించింది. అత్యవసర సేవలందించే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు నీలి రంగు బుగ్గలు వాడేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సమాజంలో అందరూ సమానమేనన్న భావన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా చెప్పారు. బుగ్గలు తీసేశారు బాగానే ఉంది కానీ రోడ్లపై విఐపిల రాక కోసం ట్రాఫిక్‌ను నిలుపుదల చేయడాన్ని కూడా తొలగిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.