తెలంగాణ

ఆయుష్‌లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణకు చెందిన భారతీయ వైద్య విధాన (ఆయుష్) శాఖలో 183 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయుష్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు 11 మంది హోమియో లెక్చరర్లు, 12 మంది ఆయుర్వేద లెక్చరర్లు, ఎనిమిది మంది యునాని లెక్చర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే హోమియోలో 36 మంది మెడికల్ ఆఫీసర్లు, 62 మంది ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లు, 54 మంది యునాని మెడికల్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈపోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆయుష్ పట్ట్భద్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.