తెలంగాణ

సవరించిన చట్టం ఎలా మంచిదో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: గత భూ సేకరణ చట్టం కంటే ఇప్పుడు సవరించిన చట్టం ఎలా మంచిదో ప్రభుత్వం స్పష్టం చేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సవరించిన చట్టం రైతులకు ఏ రకంగా మేలు చేస్తుందో ప్రభుత్వం వెల్లడించాలని అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం ఏడు నిమిషాల్లో అసెంబ్లీ, మూడు నిమిషాల్లో మండలిలో సవరణ బిల్లును ఆమోదించిన ప్రభుత్వం చేసిన సవరణలు ఏమిటనేది కూడా వెల్లడించ లేదని అన్నారు. సవరించిన చట్టంలో ముఖ్యమైన మూడు అంశాలను ప్రభుత్వం తొలగించిందని, ఇది ఏ మేరకు ఉపయోగమైనదో స్పష్టం చేయాలని కోరారు. పరిహారం అనే పదాన్ని రాష్ట్రం తీసుకు వచ్చిన చట్టంలో ఎత్తివేయగా, రెండోది భూసేకరణకు ముందు కలెక్టర్ ఆధ్వర్యంలో ధర నిర్ణయించాలి, మూడోది సోషల్ ఇంపాక్ట్ వంటి వాటిని లేకుండా చట్ట సవరణ చేసినంత మాత్రాన ఏమి ప్రయోజనం ఉందని ప్రశ్నించారు.