తెలంగాణ

ఆ భూములు వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వం నుంచి చూకగా భూములు తీసుకొని వినియోగించుకోకపోయినా, లేదా ఇతర అవసరాల కోసం వాటిని ఉపయోగించుకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శాసనసభలో ఆదివారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 43 సెజ్‌లకు ప్రభుత్వం భూములు కేటాయించగా, అందులో 28 సెజ్‌లు మాత్రమే పని చేస్తున్నాయని, మిగతా వాటిపై చర్యలు తీసుకోవటానికి నోటిసులు జారీ చేశామని మంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని వాటిని వినియోగంలోకి తీసుకురాని 294 యూనిట్ల నుంచి 400 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన కొన్ని యూనిట్లకు చెందిన 3,068 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా కోర్టుకు వెళ్లడంతో వాటిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి జూపల్లి వివరించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించారని మంత్రి గుర్తు చేశారు. టిఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానాన్ని అనుసరించి రాష్టస్థ్రాయిలో 396 యూనిట్లు ఏర్పాటు కాగా రూ. 31,631 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 98,364 మందికి ఉపాధి లభించిందని మంత్రి వివరించారు. అలాగే జిల్లాస్థాయిలో 1623 యూనిట్లు స్థాపించగా వీటి ద్వారా రూ. 3283 కోట్ల పెట్టుబడులు రాగా 33,225 మందికి ఉపాధి లభించిందన్నారు. టిఎస్-పాస్ కింద దరఖాస్తు చేసుకున్న 258 యూనిట్లకు 269 ఎకరాలు కేటాయించినట్టు మంత్రి చెప్పారు. ఇందులో 57 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెందిన యూనిట్లు ఉన్నాయన్నారు. అధికార పక్షానికి చెందిన సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజు మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన పేరిట గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి చౌకగా భూములు పొంది వాటిలో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం నుంచి రాయితీలపై భూములు పొంది వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని కొందరు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అటు పరిశ్రమలు స్థాపించక, ఇటు ప్రభుత్వం తిరిగి వాటిని స్థాపించే అవకాశం లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వారిని ఏమి చేయనున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఎస్‌ఇజెడ్) స్పెషల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జోన్స్‌గా మార్చారని ఆయన ఆందోలన వ్యక్తం చేశారు. అందుబాటులోకి రాని ఎస్‌ఇజెడ్‌లకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని మంత్రి జూపల్లి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు తెలంగాణను 13 స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ను 2వ స్థానంలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిందని, మరి అత్యుత్తమైన పారిశ్రామిక విధానం అయితే అలా ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడు దొంతి మాదవరెడ్డి మాట్లాడుతూ ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి సమాధానం చెబుతూ, వరంగల్ జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లులను తెరిపించినట్టు చెప్పారు. కొత్తగా పరిశ్రమల స్థాపనను ప్రొత్సహించడంతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ కూడా ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.