తెలంగాణ

15 రోజుల్లో డిఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 8792 పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. బుధవారం సచివాలయంలో ఎస్సెస్సీ ఫలితాలను విడుదల చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ టిఎస్‌పిఎస్‌సి ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుందని, సరిపడా సంఖ్యలో టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు) అర్హులున్నారని, కనుక ప్రత్యేకంగా టెట్ నిర్వహించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్టప్రతి ఉత్తర్వులు ఉన్నందున పాత జిల్లాల ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆయన వివరించారు. ఆరు నెలల్లోనే ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ధృవపత్రం నిబంధన తొలగించినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పట్లో ఉపాధ్యాయ బదిలీలు ఉండకపోవచ్చని చెప్పారు. డిఎస్సీ ప్రకటనతో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కూడా చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేస్తోందని అన్నారు. సిఎం కె చంద్రశేఖరరావు విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో పూర్తి సానుకూలంగా ఉన్నారని , ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా చేసే వ్యాఖ్యలను యువకులు నమ్మవద్దని చెప్పారు. అన్ని పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆరువేల పాఠశాలల్లో బయోమెట్రిక్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని, అన్ని స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకూ టీచర్లు ఉండేలా చూస్తామని చెప్పారు. సగం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.