తెలంగాణ

రైతు గుండె ఆగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 3: గిట్టుబాటు ధర దక్కలేదన్న బెంగతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కుప్పపైనే సన్నకారు రైతు ప్రాణం వదిలేశాడు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు మరణంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తోటి రైతులు యార్డు బయట ఆందోళనకు దిగారు. సంతాపంగా వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు నిలిపివేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండికి చెందిన దాసరి చిన్నగంగారాం (65) రెండెకరాల పొలంలో పసుపు పంట వేశాడు. దిగుబడిని పట్టుకుని కోటి ఆశలతో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు మంగళవారం ఉదయం చేరుకున్నాడు. అయితే మధ్యాహ్నం మూడు గంటలవరకు కూడా ఆయన పంటకు బీట్ జరగలేదు. సాయంత్రం సమయంలో ఓ కమీషన్ ఏజెంట్ గంగారాం పసుపు పంటను పరిశీలించి క్వింటాలుకు 3.5వేలు మాత్రమే ధర లభిస్తుందని చెప్పడంతో గంగారాం గుండె గుభిల్లుమంది. కనీసం 5వేలైనా ధర పలుకుతుందన్న ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. కమీషన్ ఏజెంట్‌ను ప్రాధేయపడితే చివరకు 3881 రూపాయల చొప్పున కొనుగోలుకు బేరం కుదుర్చుకున్నాడు. అప్పటికే చీకటిపడి బీట్లు బంద్ కావడంతో బుధవారం ఉదయం పంటకు తూకం వేస్తామని కమీషన్ ఏజెంట్ చెప్పాడు. దీంతో గంగారాం మంగళవారం రాత్రి భోజనం చేయకుండానే తాను తెచ్చిన పసుపు పంటపైనే తువ్వాలు పర్చుకుని నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై పంట కుప్ప పైనే ప్రాణం వదిలేశాడు. అదే యార్డుకు పంట తెచ్చిన గంగారాం తమ్ముడి కొడుకు గంగనర్సయ్య, పెదనాన్న కదలిక లేకుండా పడి ఉండడాన్ని చూసి కంగారుపడ్డాడు. గంగారాం మృతి చెందినట్టు నిర్ధారణ కావడంతో బావురుమన్నాడు. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ భోజనం కూడా చేయకుండా తన పెదనాన్న రాత్రంతా మనోవేదనకు గురై శాశ్వత నిద్రపోయి వెళ్లిపోయాడంటూ బావురుమన్నారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులెవరూ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదు. విషయం తెలుసుకున్న తోటి రైతులు పెద్ద సంఖ్యలో యార్డు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అమాంతంగా ధర తగ్గించడం వల్లే గంగారాం మనస్థాపంతో మృతి చెందాడని దుయ్యబట్టారు. రైతు మృతి ఘటనకు మార్కెట్ యార్డు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రైతులు ఆందోళనకు దిగిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన మార్కెట్ యార్డుకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులకు నచ్చజెప్పి గంగారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా, గంగారాం 15 బస్తాల పసుపు పంట మార్కెట్ యార్డుకు తీసుకురాగా, క్వింటాలుకు 3881 రూపాయల చొప్పున ధర చెల్లించేందుకు కమీషన్ ఏజెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారని, బుధవారం ఉదయం తూకం వేయాల్సివున్న క్రమంలోనే గంగారాం పంట కుప్పపై నిద్రిస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడని మార్కెట్ యార్డు కార్యదర్శి సంగయ్య వివరణ ఇచ్చారు. సదరు రైతుకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని చెప్పారు.
chitram...
నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు
పంటకుప్ప పైనే ప్రాణం వదిలిన రైతు చిన్నగంగారాం