తెలంగాణ

ఔట్‌సోర్సింగ్‌కు పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ శాఖలో 24 వేల మంది సిబ్బందిని క్రమబద్ధీకరిస్తాం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానానికి అర్థం లేదు
క్రమబద్ధీకరణకు కోర్టులు అడ్డుపడుతున్నాయి విద్యుత్ ఉద్యోగులతో సిఎం కెసిఆర్

హైదరాబాద్, మే 4: విద్యుత్ శాఖలో పని చేస్తున్న 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించబోతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుప్రకటించారు.‘ఏళ్ల తరబడి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏంది? తలకాయ లేని ముచ్చట కాకపోతే‘ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే చెప్పిన, కాంట్రా క్ట్ ఎంప్లాయిస్ ఉన్నట్టే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని, కాంట్రాక్ట్ మంత్రిని పెట్టుకుంటే, బేహతరీన్ మనుషులు దొరుకుతరు’ అని చెప్పానని కెసిఆర్ గుర్తు చేశారు. అందుకే ఈ పద్ధతి అవసరం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తుంటే కోర్టులకు వెళ్లి అపుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో కొత్త ఉద్యోగ నియామకాలు, పదోన్నత్తులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడానికి విద్యుత్ ఉద్యోగులు, అధికారులు గురువారం ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వ్యవసాయానికి తప్ప ఇతర రంగాలన్నింటికీ 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వాలంటే ఖాళీలను భర్తీ చేయడంతో పాటు అదనంగా ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారన్నారు. ఈ మేరకే కొత్తగా 13,500 మంది ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ‘విద్యుత్‌శాఖలో ఇప్పటికే 27 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాం.కొత్తగా 13,500 మంది ఉద్యోగులను నియమిస్తున్నాం.అలాగే మరో 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నాం.ఈ శాఖలో మొత్తంగా కలిపి ఉద్యోగుల సంఖ్య 75 వేలకు చేరుకుంటుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, దాని తర్వాత అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు కలిగింది ఏకైక విద్యుత్ సంస్థనేని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సంస్థ తర్వాత అధికంగా ఉద్యోగులు కలిగిన సంస్థల్లో ఆర్టీసి, సింగరేణి నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సంక్షోభం ఏర్పడి చీకట్లు కమ్ముకుంటాయని ఒక పెద్దమనిషి (మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి) కర్ర చూపించి మరీ చెప్పారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రం ఏర్పడిన వ్యవసాయానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామంటే అది ఆ సంస్థ ఉద్యోగుల కృషేనని ముఖ్యమంత్రి కొనియాడారు. అందుకే ఈ సంస్థలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని వారి సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నామన్నారు. ‘చేతి నిండ పని చెప్పాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి’ ఇది తమ ప్రభుత్వ విధానమన్నారు. కాంట్రాక్ట్ అయినా, ఔట్ సోర్సింగ్ అయినా వారేమి రెగ్యులర్ ఉద్యోగి కంటే పని తక్కువ పనేమి చేయరనే వారి సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నామన్నారు. అలాగే ఈ సంస్థలో పని చేసే క్యాజువెల్ కార్మికులకు కూడా న్యాయం చేయాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావును ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

chitram...
గురువారం ప్రగతి భవన్‌కు తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్