తెలంగాణ

బ్రాహ్మణులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్హులందరికీ కల్యాణ లక్ష్మి పథకం
అత్యుత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
విదేశీ చదువులకు ఉపకార వేతనాలు
9న బ్రాహ్మణ పరిషత్ వెబ్‌సైట్ ఆరంభం
బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి వెల్లడి

హైదరాబాద్, మే 5: అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, ఆసరా పథకాలు వర్తింపజేసేలా తోడ్పాటునందించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో వైస్ చైర్మన్ వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు పురాణం సతీష్, డాక్టర్ సువర్ణ సులోచన, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, సిఇవో చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశానంతరం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి మీడియాతో మాట్లాడుతూ కార్యవర్గ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. శ్రీ సరస్వతి విద్యాప్రశస్తి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పథకం కింద చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇవ్వాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్షల్లో 90 శాతం మార్కులు, అంతకు మించి మార్కులు సాధించిన విద్యార్థులకు 7,500 నగదు పురస్కారం అందిస్తామన్నారు. ఇంటర్మీడియేట్-పాలిటెక్నిక్‌తో పాటు సమానమైన పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 10 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు 15 వేలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 70 శాతంతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 20 వేలు, ఇంజనీరింగ్ విద్యలో 80 శాతం మార్కులు సాధించిన వారికి 35 వేలు ప్రోత్సాహక పురస్కారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
కొత్తగా ‘లక్ష్య’..
సవిల్ సర్వీసెస్, గ్రూపు-1, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ యువతీ, యువకులు తీసుకునే శిక్షణా వ్యయాన్ని ‘లక్ష్య’ పథకం ద్వారా అందించనున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యా ఉపకార వేతనం పథకం కింద చేయూతనిందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఒక ఏడాది కోర్సుకు 10 లక్షలు, ఒకటి నుంచి రెండేళ్ళ కాల వ్యవధి ఉండే కోర్సుకు 15 లక్షలు, రెండేళ్ళు లేదా ఆపై ఉండే కోర్సులకు 20 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. వేద విద్యను ప్రోత్సహించేందుకు వేద పాఠశాలల నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పేద విద్యార్థులకు నెలకు 500 రూపాయల స్ట్ఫైండ్ అందిస్తామన్నారు. 75 ఏళ్లు పైబడిన వేద, సంస్కృత, శాస్త్ర పండితులకు వృద్ధాప్యంలో ‘ఆసరా’ కల్పించేందుకు నెలకు రెండున్నర వేల గౌరవ భృతి కల్పించాలని నిర్ణయించినట్లు డాక్టర్ రమణాచారి తెలిపారు.
బీమా సౌకర్యం: సముద్రాల
బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి బీమా సౌకర్యం కల్పించాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. పథకంలో చేరే బ్రాహ్మణ కుటుంబాలకు చికిత్సకయ్యే ఖర్చులో 2 లక్షల మేరకు ఇన్యూరెన్స్ కంపెనీలు అందిస్తాయని, పథకానికి చెల్లించే ప్రీమీయంలో 75 శాతం పరిషత్, 25 శాతం లబ్దిదారుడి కుటుంబం భరిస్తుందన్నారు.
బ్రాహ్మణ సదనానికి జూలై 5న శంకుస్థాపన
పరిషత్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ నగర శివారులోని గోపన్నపల్లిలో నిర్మించనున్న బ్రాహ్మణ సదనానికి జూలై 5న సిఎం కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ ఈనెల 9న నృసింహ జయంతి పురస్కరించుకుని అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠం సాంప్రదాయ పాఠశాలల్లో బ్రాహ్మణ బాలికల విద్యాభ్యాసానికి పరిషత్ ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించిందని తెలిపారు. మార్చి నెలాఖరులో పరిషత్ నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు.

చిత్రం... సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న చైర్మన్ కెవి రమణాచారి