తెలంగాణ

ధర్నాచౌక్‌పై తాడో పేడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15న ప్రభుత్వానికి ప్రజాగ్రహాన్ని చూపిస్తాం టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్
తేల్చుకోడానికి సిద్ధమవుతున్న అఖిలపక్షం బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వామపక్షాల మద్దతు

హైదరాబాద్, మే 5: నగరంలోని ఇందిరా పార్కును శివారులకు మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కనె్నర్ర చేశాయ. 15న ఇందిరా పార్కును ఆక్రమించి ప్రతిపక్షాల, ప్రజాసంఘాల సత్తా ఏమిటో నిరూపించాలని అఖిలపక్షం నిర్ణయించింది. టిజెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ధర్నా చౌక్‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదని, ప్రజాస్వామ్యయుతంగా పోరాడి సాధించుకోవాలని నిర్ణయించారు. 8న కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పించాలని, 9న రాష్డ్ర డిజిపిని, 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని నిర్ణయంచారు. 12న తెలంగాణ అమరు వీరుల స్థూపం (గన్ పార్కు) వద్ద వౌన దీక్ష నిర్వహించాలని, దీక్షకు విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ ఆహ్వానించాలని, 15న ఛలో ఇందిరాపార్కు పేరిట ధర్నా చౌక్ చేరుకుని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అంతకు ముందు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ లోగడ ఉమ్మడి ఆంధ్రలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రజాగ్రహంతో తుని రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారని, తర్వాత మళ్లీ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమైనప్పుడు పోలీసులు అభ్యంతరం చెప్పారని, ఈ దశలో కోర్టు శాంతి భద్రతలను కాపాడలేరా? అని ప్రశ్నించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నిరసన ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళేందుకు ఉన్న ఇందిరా పార్కును సాధించుకోవాలన్నారు.
ధర్మ గంట ఉండేది..: భట్టి
టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ నాడు రాజుల కాలంలో కూడా ఇంత నిరంకుశ్వం లేదని అన్నారు. రాజు దృష్టికి ఏదైనా సమస్య తెలియజేయాలనుకుంటే ధర్మ గంట మోగించగానే, రాజు స్పందించే వారని ఆయన గుర్తు చేశారు. పైగా అప్పుడు దర్బార్లు ఉండేవని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలను అసెంబ్లీలో, బయటా మాట్లాడనీయడం లేదని అన్నారు. రాజ్యాంగం సంక్షోభంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత ముఖ్యమైన రిజర్వేషన్ బిల్లు, భూసేకరణ సవరణ బిల్లు సమయంలోనూ ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఆమోదించుకున్నదని భట్టివిక్రమార్క విమర్శించారు.
ప్రగతి కాదు..పొగడ్తల భవన్
టిడిపి అధ్యక్షుడు రమణ విమర్శ
టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించింది ప్రగతి భవన్ కాదు పొగడ్తల భవన్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని అన్నారు. ప్రజలను ఊహ ప్రపంపంలో విహరింపజేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు లేకపోతే ఆ పాఠశాల పని తీరు ఎలా ఉంటుందో, ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవడంతో పరిపాలన అలా మారిందని ఆయన విమర్శించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరినీ చూడలేదని ఆయన అన్నారు.
డబ్బా కొట్టే భవన్: చాడ
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు డబ్బా కొట్టే భవన్‌గా మారిందని విమర్శించారు. ఇందిరా పార్కును సాధించుకోవడమనేది ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు ఇది పరీక్షా సమయమని అన్నారు. ఈ నెల 15న ఇందిరా పార్కును కలిసి కట్టుగా ఆక్రమించుకుందామని ఆయన తెలిపారు. గన్‌పార్కు వద్ద వౌన దీక్ష చేపడదామని ఆయన అన్నారు. ఇందిరా పార్కు వద్దే నిరసన దీక్షలు కొనసాగించాలని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో బిజెపి నాయకుడు జి. ప్రేమేందర్ రెడ్డి, సిపిఐ-ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకురాలు రమాదేవి, సిపిఎం నాయకుడు నర్సింహారావు, న్యూడెమోక్రసీ నేత గోవర్దన్, పిఎల్ విశే్వశ్వర రావు తదితరులు ప్రసంగించారు.