తెలంగాణ

మత ఘర్షణలతో ఉట్నూరు ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాళ్లదాడిలో ఎస్పీ, ఏఎస్పీ సహా ఏడుగురు పోలీసులకు గాయాలు
లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం పరిస్థితిపై డిఐజి సమీక్ష

ఆదిలాబాద్, మే7: ఆదివాసీలకు నెలవైన ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో ఆదివారం మత ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరువర్గాలు రాళ్లదాడులతో విధ్వంస ఘటనలకు పూనుకోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అదనపు ఎస్పీ పనసారెడ్డితో సహా ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్న సంఘటనలో వారించబోయిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కుడిచేతి బొటనవేలు చితికిపోయి విరిగింది. పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో జిల్లా పోలీసు బలగాలు మొహరించి లాఠీచార్జి, భాష్ప వాయువులు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టాయ. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూరుకు చెందిన ఓ ఆకతాయి ఒక మతాన్ని, ధర్మాన్ని కించపరుస్తూ దేవతల పట్ల అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టే ఘర్షణలకు ఆజ్యం పోసింది. ఇతగాడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదం సృష్టించాయ. ఆ వ్యక్తిపై కేసు నమోదుచేసి అరెస్ట్‌చేయాలని, మరో వర్గానికి చెందిన కార్యకర్తలు ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడంపై ఆగ్రహం చెందిన ఆ వర్గనేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. వెంటనే సిఐ గణపతిజాదవ్ చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఐదు దుకాణాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ఓ వర్గానికే కొమ్ముకాస్తూ మరో వర్గం చేసిన ఫిర్యాదును పట్టించుకోవడంలేదని ఆందోళన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఆందోళన కారులు పెద్ద యెత్తున దాడులకు పూనుకున్నారు. ఆదివారం ఉదయం పరిస్థితి మరింత విషమించింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంఘటనలో 8 మంది పౌరులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, అడిషినల్ ఎస్పీ పనసారెడ్డి, డిఎస్పీ లక్ష్మినారాయణలు ఇరువర్గాలకు చెందిన సభ్యులను పిలిచి ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇరువర్గాలు రోడ్డుపైనే రాళ్లురువ్వుకున్నారు. ఈ దాడుల్లో ఎస్పీ కుడిచేయ వేలు చిట్లిపోయంది. అడిషినల్ ఎస్పీ పనసారెడ్డికి, మరో ఏడుగురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి జరిపి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. అయనా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ రేంజ్ డి ఐజి రవివర్మ, ఆదిలాబాద్ కలెక్టర్ బుద్ద ప్రకాష్‌జ్యోతి, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఉట్నూర్‌చేరుకుని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. డిఐజి రవి వర్మ మీడియాతో మాట్లాడుతూ శాంతి కమిటీ సభ్యులు సంయమనం పాటించాలని అతిగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీడియా మిత్రులు సైతం సంయమనం పాటించి సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ మాట్లాడుతూ గిరిజన కేంద్రంలో మత ఘర్షణలు చెలరేగడం ఏజెన్సీ ప్రాంతానికే మాయని మచ్చగా నిలుస్తుందని, ఈ సంఘటన దురదృష్టకరంగా పేర్కొన్నారు. ఉట్నూర్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, విధ్వంసాలు, ఘర్షణలకు చెలరేగితే సహించేది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు ఉట్నూర్‌లో పరిస్థితి తీవ్రత తగ్గకపోవటంతో మంచిర్యాల, బెల్లంపెల్లి, నిర్మల్, ఆదిలాబాద్‌ల నుండి ఏ ఆర్, స్పెషల్‌పార్టీ పోలీసు బలగాలను రప్పించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
chitram...
రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు

బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు