తెలంగాణ

తొలగిన భూగండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవరించిన చట్టానికి కేంద్రం ఆమోదం?
న్యాయస్థానాల్లోనూ తొలగిన అడ్డంకి
పుంజుకోనున్న ప్రాజెక్టులు
వేగంగా ఫార్మాసిటీ ఏర్పాటు
ప్రాజెక్టులకు కావలసింది 3.67లక్షల ఎకరాలు
సేకరించింది 2.77లక్షలు
త్వరలోనే 90వేల ఎకరాల సమీకరణ

హైదరాబాద్, మే 7: కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రతిబంధకంగా మారిన భూ సేకరణ ప్రక్రియకు అడ్డంకులు దాదాపుగా తొలిగిపోయాయి. కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టం-2016కు కేంద్రం సూచన మేరకు శాసనసభలో సవరణలు చేసి ఢిల్లీ పంపించిన విషయం తెలిసిందే. తాజా సవరణలతో కూడిన చట్టానికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తుందని విశ్వనీయ వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ప్రధానమైన మరో అడ్డంకీ తొలిగిపోయినట్లే అయిం ది. తెలంగాణ రాష్ట్రం మూడో ఆవిర్భావ దినోత్సవానికి కంటే ముందుగానే కేంద్రం నుంచి ఆమోద ప్రకటన, ఇక్కడ కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన భూ సేకరణ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుండటంతో నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు ఫార్మాసిటీ ఏర్పాటు సైతం ఇక వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు ప్రధాన అంశాల ప్రాతిపదికపైనే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిధులు, నియామకాల విషయంలో పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో అడుగులు వేగంగా పడుతున్నాయి. అయితే నీటిపారుదల ప్రాజెక్టులకు భూ సేకరణ అంశమే గుదిబండగా మారింది. ఇప్పుడు ఇది కూడా తొలిగిపోవడం వల్ల మిగిలిన రెండేళ్ల వ్యవధిలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంలో సింహభాగం పనులు సకాలంలో పూర్తి అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 3,67,218 లక్షల ఎకరాలు భూ సేకరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కోర్టు వివాదాలు, ఇతర సాంకేతిక అడ్డంకులు లేని 2,77,409 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మరో 89,808 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రధానంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కాళేళ్వరం ప్రాజెక్టు కోసమే 35,729 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 12,445 ఎకరాలు, దేవాదుల ప్రాజెక్టు కింద 5,642 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో నిర్వాసితులకు పరిహారం చెల్లించే అంశంపై బాధితులు, వారి తరపున ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నిలిచిపోయింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని కొన్ని లొసుగులు భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోవటానికి మరోకారణమైంది. కేంద్ర చట్టానికి అనుగుణంగా దానికంటే మెరుగైన పరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తెలంగాణ భూ సేకరణ చట్టం-2016ను రూపొందించింది. తమకంటే మెరుగైన పరిహారాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చిన గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన చట్టానికి కేంద్ర అమోదించింది. ఆ రాష్ట్రం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా సొంతంగా భూ సేకరణ చట్టాన్ని తీసుకురావడంతో కేంద్ర ఆమోదించడం లాంఛనప్రాయమేనని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి.