తెలంగాణ

కార్పొరేట్ కాలేజీలను పోషిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: కార్పొరేట్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఎబివిపి ఎద్దేవా చేసింది. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, రోజురోజుకూ అవినీతి, బంధుప్రీతి పెరిగిపోతోందని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిందని సమైక్య పాలన కంటే ఘోరంగా పరిపాలనలో విఫలమైందని అన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో గత ఏడాది కంటే 15 శాతం ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుకుని దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫీజులపై ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీని వేసి నివేదిక ఇచ్చినా, ఇంకా దానిని అమలు చేయలేదని, డిఇఓలు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని, ఎక్కడా తనిఖీలు లేవని, అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్స్‌పై చర్యలు లేవని అన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో పాఠశాలల ముందు ధర్నా చేస్తామని, మే 27న రాష్ట్రప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తామని అన్నారు. జూన్ 15న జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్ల వ్యవహారంపై ఇంత వరకూ ఇతమిత్థంగా ఎలాంటి ప్రకటన చేయలేదని కార్పొరేట్ కాలేజీలు ఎవరికి వారు అడ్మిషన్లు చేసుకుంటూ క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పారు.