తెలంగాణ

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి వెల్లడించారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, పెను గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలపై భారీగా చెట్లు, హోర్డింగులు విరిగిపడడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ద్వారకాపురి కాలనీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, హైదరాబాద్ నార్త్ సర్కిల్‌లోని బంజారాహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు.
రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలో దాదాపు 100 విద్యుత్ స్తంభాలు, రంగారెడ్డి సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిల్ పరిధిలో 120 స్తంభాలు నేలకొరగగా, 12 విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 306 నెంబర్ 11 కెవి ఫీడర్, 24వ నెంబర్ 33 కెవి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని, కొన్ని చోట్ల వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేసినట్లు రఘుమారెడ్డి వెల్లడించారు.
దాదాపు గంటకు వంద కి.మీ పైబడిన వేగంతో గాలులు వీచాయని, దీని వల్ల భారీగా లైన్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 500 మంది విద్యుత్ సిబ్బంది, అధికారులు గత రాత్రి నుంచి విధుల్లో కొనసాగుతూ విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారని వివరించారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని తాకకూడదని సూచించారు.