తెలంగాణ

ప్రభుత్వ తీరును ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, మే 10: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని రత్తిపల్లి, క్రిష్టాపురం గ్రామంలో ఎంపి కోటా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పథకాలను ప్రవేశ పెడుతూ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతిస్తున్నాయన్నారు. మూడేళ్ళ పాలనలో గ్రామాలలో అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రతి గ్రామానికి కృష్ణాజలాలు అందించిందని, ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాతలైన్లను మరమ్మతులు చేయకుండా కొత్తగా లైన్ వేయడంలో నిధులను దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రభుత్వం పెండింగ్‌లో ప్రాజెక్ట్‌లను పూర్తి ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలని కోరారు. క్రిష్టాపురం గ్రామంలో శ్మశానవాటిక ప్రహరీకి నిధులు మంజూరు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం..క్రిష్టాపురంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి