తెలంగాణ

కెసిఆర్ వల్లే మిర్చి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మే 10 : రాష్ట్రంలో మిర్చి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనికి ముఖ్యమంత్రి కెసిఆర్ కారణమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపిం చారు. పత్తి వద్దు మిర్చి వేసుకోండి, కందులు వేసుకోండనే సలహాల వల్లనే 7 లక్షల క్వింటాళ్ల మిర్చి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మార్కెట్‌లలో రైతులు ఆందోళన చేశారని అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం 700 కోట్ల రూపాయలతో కందులు కొనుగోలు చేసిందని, మిర్చికి బోనస్‌తో కలిపి క్వింటాలుకు 6120 చెల్లించి 3 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసిందని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న 42 ఎత్తిపోతల పథకాలను చేపట్టకుండా బంగారు తెలంగాణ తెస్తామంటే ఎవరు నమ్ముతారని మంత్రి వ్యాఖ్యానించారు. మిర్చి రైతులకు అదనంగా మరో 2 వేలు చెల్లించకుండా బిజెపి, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేస్తారా, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అసలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోయిందని అన్నారు. కేంద్రంపై నిందలు వేస్తే తగిన గుణపాఠం చెపుతామని కేంద్ర పథకాల కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పట్టణాలలో లక్షా 50 వేలు, గ్రామాలలో 1లక్ష ఇస్తున్నామని సూర్యాపేట జిల్లాకే ఇప్పటి వరకు 21 కోట్లు మంజూరు చేశామని అన్నారు. పలు కేంద్ర పధకాల కింద జిల్లాకు 400 కోట్ల రూపాయలు ఇచ్చామని అన్నారు. జాతీయ రహదారులకు 2240 కోట్లు, విజయవాడ, హైదరాబాద్ రహదారికి 244 కోట్లు, నక్రెకల్, నాగార్జునసాగర్ రహదారికి 2070 కోట్లు మంజూరు చేశామని అన్నారు.
తెలంగాణలో 2019లో
బిజెపికి అధికారం ఖాయం
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపికి తిరుగులేకుండా అనేక రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిందని, 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి రావటం ఖాయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన బుధవారం వామపక్షాలు దేశంలో కరుమరుగయ్యాయని, కాంగ్రెసు పార్టీ కుచించుకుపోతున్నదని, రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య పోటీ ఉంటుందని అన్నారు. దేశంలో దోపిడ లేని సమాజం కోసం, పేదల సంక్షేమానికై నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలోని సిమెంటు కర్మాగారాల, రైస్ మిల్ కార్మికుల కోసం మేళ్లచెర్వులో 30 పడకల ఇయస్‌ఐ వైద్యశాల మంజూరు చేస్తానని మంత్రి ప్రకటించారు.