తెలంగాణ

పుస్తకాలు ముద్రించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: పరీక్షలు నిర్వహించే బోర్డులు పుస్తకాలను ముద్రించే పనిలో ఉండటం వల్ల సరికొత్త సమస్యలు వస్తున్నాయని, ఏదో ఒక పనిని మాత్రమే చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పరీక్షల బోర్డులను ఆదేశించింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పుస్తకాలను ముద్రించడం, ఇంటర్ పరీక్షలను నిర్వహించడం మరో పక్క ఇంటర్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపును ఇవ్వడం వంటి విశేష కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్ పుస్తకాలను ముద్రించేందుకు తెలుగు అకాడమి ఉన్నా, ఆ బాధ్యతను ఇంటర్ బోర్డు కూడా తీసుకుంది. గతంలో పాఠ్యప్రణాళికనూ తెలుగు అకాడమి రూపొందించేది, తర్వాతి కాలంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆ బాధ్యతను స్వీకరించి సొంతంగా వర్కుషాప్‌లు ఏర్పాటు చేసి, రిసోర్స్ పర్సన్స్‌తో పాఠ్యప్రణాళికను రూపొందించడమేగాక, నేరుగా లాంగ్వేజీ పుస్తకాల ముద్రణ బాధ్యతలను కూడా చేపట్టింది.
కొన్ని పుస్తకాలను మాత్రం తెలుగు అకాడమికి అప్పగించింది. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో పుస్తకాల ముద్రణ వ్యవహారాలను చూసేందుకు, పాఠ్యప్రణాళికను చూసేందుకు ఎన్‌సిఇఆర్‌టి ఉన్నా, సిబిఎస్‌ఇ పెత్తనం కొనసాగిస్తోంది. తాజాగా సిబిఎస్‌ఇ అనేక జాతీయస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నందున పుస్తకాల రూపకల్పన బాధ్యతల నుండి తప్పుకోవాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పుస్తకాల ముద్రణపై సర్వ హక్కులనూ ప్రదర్శించే ఈ సంస్థలు చివరికి పుస్తకాల లభ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు.
సిబిఎస్‌ఇ ప్రచురించిన పుస్తకాల్లో కూడా తప్పులు దొర్లినట్టు తేలింది. అవే పుస్తకాలను రాష్ట్రప్రభుత్వాలు రాయల్టీ చెల్లించి కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ కూడా అవే తప్పులు పుస్తకాల్లో వస్తున్నాయి. చివరికి పరీక్షల్లో కూడా ప్రశ్నల్లో తప్పులు దొర్లుతున్నాయి. సిబిఎస్‌ఇ వ్యవహార సరళిపై సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టంకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించే బోర్డులు పుస్తకాలను రూపొందించే పని నుండి విముక్తం కావాలని ఆదేశించింది.