తెలంగాణ

కంటోనె్మంట్ రోడ్లను తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: సికింద్రాబాద్ కంటోనె్మంట్ పరిధిలోని (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) రోడ్డును మూసివేయవద్దని తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. గురువారం ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మలు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. కంటోనె్మంట్ పరిధిలోని రోడ్లను మూసేయడం సరికాదని, మరోమార్గం నిర్మాణం చేసే వరకు ఈ రోడ్డును మూసేయవద్దని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు నెలలకోసారి ఆర్మీ సిబ్బంది ఈ రహదారి మూసేస్తున్నారని దాని మూలంగా 35 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కేంద్రానికి వివరించారు. జూబ్లీ బస్‌స్టాండ్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారిపై ప్లై ఓవర్ నిర్మిస్తే దాదాపుగా తెలంగాణ ఎనిమిది జిల్లాల వారిగా ప్రయాణం సులభతరం అవుతుందని, దీనికి కావలసిన 100 ఎకరాల రక్షణ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని విజ్ఞప్తి చేసినట్టు ఎంపీ జీతేందర్ రెడ్డి తెలిపారు. 100 ఎకరాల కంటోనె్మంట్ భూమిని తెలంగాణకు కేటాయిస్తే, ఇందుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రికి వివరించింనట్టు తెలిపారు. అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి ఏయిమ్స్ ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, దానికి నిధులు విడుదల చేయాలని కోరినట్టు ఎంపీ జీతేందర్ రెడ్డి తెలిపారు.