తెలంగాణ
మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 May 2017
హైదరాబాద్, మే 11: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మెడికల్ పిజి కోర్సుల్లో కన్వీనర్, మేనేజిమెంట్ కోటా ఫీజులను పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన వెకేషన్ బెంచి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ జారీ అయిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని, కాలేజీ మేనేజిమెంట్లు పాత ఫీజును అంగీకరించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అర్జున్‌రెడ్డి వాదనలు వినిపించారు. తుది తీర్పు ఆధారంగా ఫీజు విధి విధానాలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది.