తెలంగాణ

22నుంచి గొర్రెల కాపర్ల సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గొర్రెల పెంపకం, గొర్రెల పంపిణీ పథకం విజయవంతం అయ్యేందుకు శాస్ర్తియ విధానంలో ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. జూన్ 20వ తేదీ నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించనున్న గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చర్చించేందుకు గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గొర్రెల కాపరులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుండి జిల్లాల్లో సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు గుర్తు చేశారు. ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలను, ఒక పొటేలును ఇస్తామన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన గొల్ల, కుర్మ కులస్తులను గొర్రెల పెంపకందారుల సొసైటీలో సభ్యులుగా చేర్చుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 1న ప్రారంభమైందని, 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు లక్షల గొర్ల, కురుమల కుటుంబాలు ఉన్నాయని, సభ్యత్వ నమోదు తర్వాత తాజా సంఖ్య ఎంత ఉంటుందో ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకం ప్రకారం 2017 లో 42 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తామని, 2018 లో మిగతా 42 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి, మండలస్థాయిలోకలెక్టర్, తహశీల్దార్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. ఈ కమిటీల నేతృత్వంలోనే గొర్రెల పంపిణీ జరుగుతుందని వివరించారు. గొర్రెల పంపిణీకి ముందే ప్రతి నియోజకవర్గంలో 100 సంచార పశువైద్య వాహనాలు ఉంటాయన్నారు.
కొత్తగా రానున్న గొర్రెల కోసం గ్రాసం పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని తలసాని వివరించారు.