తెలంగాణ

నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ సవతి తల్లి ప్రేమ చూపించేది మీ కన్నతల్లే( కాంగ్రెస్) అని విమర్శించారు. ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకం పనులు 2019 నాటికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా ఎఎంఆర్ బ్రాహ్మణ వెల్లముల ఎత్తి పోతల సాగునీటి ప్రాజెక్టు కాలువలు, సిఎం అండ్ సిడి పనులు, పంపిణీ నెట్‌వర్క్ గట్టు పనుల దర్యాప్తు పురోగతిలో ఉందని తెలిపారు. భూమి పని అప్రోచ్ చ్యానెల్ తవ్వకం, ప్రధాన సొరంగం తవ్వకం, సిఓటి ఫిల్లింగ్, సమాంతర ఇసుక ఫిల్టర్ల ఏర్పాటు కట్ట ప్రవాహం మడుగు తవ్వకం , పంప్ హౌజ్ తవ్వకం పనులు పూర్తయినట్టు హరీశ్‌రావు తెలిపారు. 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనుల్లో వేగం పెంచాలని సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించగా, ఈ అంశంపై గతంలోనే ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్టు హరీశ్‌రావు గుర్తు చేశారు. సొరంగం తవ్వకం పనులు నెలకు అర కిలో మీటరుకు మించి జరగదని, ఆ యంత్రాల పనిసామర్థ్యమే అలా ఉందని హరీశ్‌రావు తెలిపారు. తీవ్రంగా ప్రయత్నిస్తే, నెలకు 0.6 కిలో మీటర్ల సొరంగం తవ్పుతుందని తెలిపారు. మూడేళ్ల పాటు పనులు నిలిచిపోయాయని, నెల రోజుల నుంచి పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. జిల్లాలో పర్యటించి టన్నల్ తవ్వకాల పనులు పరిశీలించనున్నట్టు తెలిపారు. నాగార్జున సాగర్ కాలువ సిమెంట్ లైనింగ్‌ను చేపట్టే విషయం ప్రభుత్వం పరిశీలిస్తోందని, 250 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని హరీశ్‌రావు తెలిపారు. నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. ఏదేళ్లలో 35శాతం పనులు చేస్తే, ఇప్పుడు 90 ఆతం పనులు పూర్తయినట్టు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ పనులను పరిశీలించి ఆరవ గ్రేడు ఇచ్చిందని, పనుల వేగాన్ని అభినందించిందని తెలిపారు. గతంలో మనకు అసలు గ్రేడులే ఉండేవి కాదని తెలిపారు.