తెలంగాణ

జోనల్ వ్యవస్థ రద్దుపై మళ్లీ కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: భూ సేకరణ చట్ట సవరణకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్ర నుంచి ఆమోదముద్ర వేయించుకుని పంతం నెగ్గించుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అదే స్ఫూర్తితో జోనల్ వ్యవస్థ రద్దుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో జోనల్ వ్యవస్థ రద్దుకు అవకాశం ఉండటంతో చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జోనల్ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండటంతో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలు దీనికి లోబడే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఇక ముందు జోనల్ వ్యవస్థ అవసరం లేదని, రాష్ట్రంలో స్టేట్ క్యాడర్, డిస్ట్రిక్ట్ కేడర్ రెండు కేటగిరీలు మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థ ఉండాలా? రద్దు చేయాలా? అన్న అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ అభిప్రాయాలు సేకరించారు.
ఒక్క రెవిన్యూ ఉద్యోగుల సంఘం మినహా దాదాపు అన్ని ఉద్యోగుల సంఘాలు జోనల్ వ్యవస్థ రద్దుకే మొగ్గు చూపాయి. ఇప్పటికే జోనల్ కేడర్‌లో ఉన్న ఉద్యోగులను రిటైర్డు అయ్యే వరకు అదే కేడర్‌లో కొనసాగిస్తూ కొత్తగా జరిపే నియామకాల్లో జోనల్ వ్యవస్థ రద్దు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు సూచించాయి. ప్రభుత్వం కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవించింది. అయితే జోనల్ వ్యవస్థ రద్దు అంశం రాష్ట్ర పరిధిలో లేకపోవడంతో కేంద్రం నుంచి ఆమోదం పొందేదాకా ఉద్యోగ నియామకాలను నిలిపి వేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం జరిగే నియామకాలను జోనల్ విధానం ప్రకారమై జరిపి, ఆ తర్వాత బిల్లు ద్వారా ఆ వ్యవస్థను రద్దు చేసుకోవచ్చని ప్రభుత్వం మధ్యమార్గాన్ని ఎంచుకుంది. ఒకవైపు ఉద్యోగ నియామకాల ప్రక్రియను కొనసాగిస్తూనే, మరోవైపు జోనల్ వ్యవస్థ రద్దు ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి అప్పగించారు. జోనల్ వ్యవస్థ రద్దు చట్ఠబద్ధంగా జరగడానికి మొదట దీనిపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించి అధ్యయనం చేయించి దాని సిఫారసుల ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. రెవిన్యూశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు దీంట్లో మరో ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి వచ్చాక అధికారికంగా ప్రకటన చేయనున్నారని అధికార వర్గాల సమాచారం.
మే నెలాఖరున మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి జూన్ నెలాఖరు వరకు జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు. శాసన సభ వర్షాకాల సమావేశాలను జూలై నిర్వహించి అందులో జోనల్ వ్యవస్థ రద్దుపై బిల్లు పెట్టి ఆమోదించుకునే విధంగా అధికారులు కార్యాచరణను రూపొందించినట్టు అధికార వర్గాల సమాచారం. విభజన చట్టంలోనే జోనల్ వ్యవస్థను కొనసాగించడం కానీ, రద్దు చేయడం కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయం మేరకు నడుచుకునే వెసులుబాటు కల్పించడంతో సాంకేతికపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది.