తెలంగాణ

స్థిరాస్తుల వివరాలు పంపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఐపిఎస్ అధికారులు వెంటనే తమ కుటుంబాలకు చెందిన స్థిరాస్తుల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించాలని సూచిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్క్యులర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలకు పంపించారు.
ఈ ప్రతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అందాయి. స్థిరాస్తుల వివరాలను పంపించని పక్షంలో పదోన్నతులను, ఇతర సర్వీసు బెనిఫిట్లను నిలిపివేయాల్సి వస్తుందని కేంద్ర హోంశాఖ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. స్థిరాస్తుల రిటర్న్స్‌ను ప్రతి ఏడాది జనవరి 31వ తేదీలోగా ఐపిఎస్ అధికారులు పంపించాల్సి ఉంటుంది. ఇంకా వివరాలను పంపని అధికారులు ఈ నెలాఖరులోగా పంపించాలని కేంద్రం ఆదేశించింది. వివరాలు పంపించని అధికారులకు విజిలెన్స్ క్లియరెన్స్ లభించదు. దీని వల్ల పదోన్నతులు నిలిచిపోతాయి. దేశంలో మొత్తం 3894 మంది ఐపిఎస్ అధికారులు ఉన్నారు.
ఇందులో 20 శాతం మంది అధికారులు ఇంకా వివరాలను పంపించలేదని సమాచారం. 800 మంది ఐపిఎస్ అధికారులు ఈ వివరాలను పంపించాల్సి ఉంది. అఖిల భారత సర్వీసు రూల్స్ 1968 ప్రకారం ప్రతి కేంద్ర సర్వీసుల అధికారులు ప్రతి ఏటా జనవరి 31వ తేదీలోగా స్థిరాస్తుల రిటర్న్స్‌ను పంపాలి. 2011 సెప్టెంబర్ 7వ తేదీన ఈ రూల్స్‌ను సవరించారు. దీని ప్రకారం జనవరి 31వ తేదీ లోపల వివరాలు ఇవ్వకపోతే విజిలెన్స్ క్లియరెన్స్ లభించదనే క్లాజును చేర్చారు.