తెలంగాణ

రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు వందకోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది. ఒకవైపు రోడ్లు వేస్తుండగా, మరోవైపు ఆ రోడ్లను తవ్వివేస్తుండటంతో ప్రభుత్వ నిధులు వృథాఅవుతున్నాయి. అలా తవ్వడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లు సాధాణంగా మూడు రకాలుగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రాష్టర్రహదారులు, పంచాయతీరోడ్లు ప్రధానమైనవి. జాతీయ రహదారులైతే కేంద్రం, రాష్ట్ర రహదారులను రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరోడ్లను పంచాయతీరాజ్ శాఖ నిర్మాణం, నిర్వహణ చేస్తున్నాయి. రోడ్లు ఏవైనా వీటి నిర్వహణ విషయంలో ఇప్పటి వరకు స్పష్టమైన ఒక ప్రణాళిక, నియమావళి ప్రభుత్వం రూపొందించలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు రోడ్లశాఖకు కేటాయించింది. రోడ్లను వెడల్పు చేసేందుకే 5860 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. రోడ్లు వేసే సమయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, విద్యుత్తు, మున్సిపల్ వ్యవహారాలు/ గ్రామపంచాయతీ, కమ్యూనికేషన్లు, రోడ్లను తవ్వి కేబుళ్లు వేసే వివిధ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తే, ఏ ప్రాంతంలో ఎవరి అవసరాలు ఏమిటో ముందుగా వెల్లడవుతుంది. తొలుత ఆయా శాఖలు రోడ్లను తవ్వి తమ అవసరాలకు అనుగుణంగా కేబుళ్లు వేయడం, పైపులు వేయడం పూర్తి చేసిన తర్వాత తారురోడ్లో, సిమెంట్‌రోడ్లో వేస్తే బాగుంటుందన్నది అందరి అభిప్రాయం. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకచోట ఒకవైపు తారురోడ్డు/ సిమెంట్ రోడ్డు వేసిన రెండు, మూడు నెలలకే ఆ రోడ్డును తవ్వివేస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్డును తవ్విన తర్వాత ఆ రోడ్డుకు సంబంధించి తవ్విన సిమెంట్ ముక్కలు, తారు పలకలు (గడ్డలు) అలాగే రోడ్లపై వదిలివేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లను అడ్డంగా తవ్వి సరిగ్గా పూడ్చకుండా వదిలి వేయడంతో ఒక కాలువలా మారిపోతోంది. ఇలాంటి చోట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పెద్దపెద్ద గుంటలు తవ్వి సరిగ్గా పూడ్చకుండా వదిలివేస్తున్నారు. అలాంటి చోట్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో రోడ్లు వేసే సమయంలో వివిధ శాఖల అధికారులతో చర్చలు జరిపి సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ప్రణాళిక లేకపోవడం వల్ల రోడ్లను తవ్వి వదిలివేసిన చోటల్లా మళ్లీ రోడ్లు వేసేందుకు ప్రభుత్వం తన ఖజానా నుండి ఏటా దాదాపు వంద కోట్ల వరకు వినియోగించాల్సి వస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల కాంట్రాక్టర్లే లాభపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.