తెలంగాణ

యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 13: సురక్షితంగా గమ్యస్థానికి చేర్చాల్సిన ఓ క్యాబ్ డ్రైవర్.. యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి నారపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. నగరంలోని సీతాఫల్‌మండిలో నివాసం ఉంటున్న పబ్ డ్యాన్సర్ కల్పన (20) శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమీపంలో ఉప్పల్ వెళ్లాల్సి ఉండగా పరిచయం ఉన్న రవి అనే క్యాబ్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ రవితో పాటు మరో ముగ్గురు యువకులు సీతాఫల్‌మండికి చేరుకుని యువతిని కారులో ఎక్కించుకున్నారు. మరో ముగ్గురు యువకులు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా తెలిసిన వారని, శ్రీశైలం వెళ్తున్నారనీ.. ఉప్పల్‌లో దిగిపోతారని చెప్పినట్లు తెలిపారు. ఉప్పల్‌లో ముగ్గురు యువకులు దిగిపోగా.. క్యాబ్ డ్రైవర్ కల్పనను కారులో ఎక్కించుకుని నారపల్లి వరకు తీసుకువెళ్లి అక్కడ మూడు బీర్లు కొని ఒక్క బీరును యువతికి తాగించినట్లు చెప్పారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ కళాశాల సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేయటంతో పాటు తన మిత్రులకు లైంగికంగా సహకరించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీంతో మహిళ ప్రతిఘటించి 100 నెంబర్‌కు డయల్ చేయగా ఫోను లాక్కొని దాడి చేసినట్లు తెలిపారు. యువతి చేతిని నిప్పుతో కాల్చినట్లు చెప్పారు. యువతి అరవటంతో కారులో తీసుకువచ్చి పీర్జాదిగూడలోని బిగ్ బజార్ వద్ద వదిలి పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు.