తెలంగాణ

త్వరలో 1305 అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మే 13: అడవుల పెంపు నకు అటవీ ప్రాంతాల్లోని ఖాళీస్థలాల్లో మొక్కల పెంపకానికి సీడ్‌బాల్స్ వేయనున్నట్టు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా 1305 క్షేత్రస్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయనున్నట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిని ఉపేక్షించేదిలేదని, ఎంతటి వారైనా చర్య లు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 25 మంది వేటగాళ్లపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశామన్నారు. చైనా, బ్రెజిల్ తర్వాత దేశంలోనే కొత్త రాష్ట్రంలో ఇంతపెద్దయెత్తున హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి కెసిఆర్ సాహసానికి నిదర్శనమన్నారు. శనివారం మెదక్, హవేళీఘణాపూర్ మండలాల్లో డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి నర్సరీ, పోచారం వన్యప్రాణి అభయారణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం డిబిసి వద్ద విలేఖరులతో మాట్లాడారు. మొదటి, రెండు విడతల్లో 48.50 కోట్ల మొక్కలు నాటడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాలు సహకరించాయన్నారు. ఈసారి అటవీ ప్రాంతాల్లో కూడా పెద్దయెత్తున మొక్కలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. కర్నాటకలో చేపడుతున్న కార్యక్రమాలను కరీంనగర్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్ అధికారి అమర్‌నారాయణ బృందం పరిశీలించివచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రస్తు తం 23 శాతం విస్తీర్ణం ఉండగా దాన్ని 33 శాతం అడవులు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 26 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందన్నారు. కలప అక్రమ రవాణాదారులపై పీడీ కేసులు నమోదు చేస్తామన్నారు.
బిసిల అభ్యున్నతికి కెసిఆర్ కృషి
బిసిలకు కేంద్రం 1250 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 5 వేల కోట్ల బడ్జెట్ పెట్టిందని బిసి, అటవీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. బిసిల అభ్యున్నతిపట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బిసిల్లో 113 కులాలున్నాయని పేర్కొన్నారు. బిసి కమిషన్ నివేదిక ఇచ్చిన మరుక్షణమే తదుపరి చర్యలుంటాయన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి జోగు రామన్న, చిత్రంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి