తెలంగాణ

8 పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: రాష్ట్ర అసెంబ్లీ ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, రెవెన్యూ, పౌరసరఫరాలు, హోం, వ్యవసాయ, సహకార శాఖలకు సంబంధించిన పద్దుల (డిమాండ్ల)కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు కోత తీర్మానాలను సంబంధిత శాఖల మంత్రులు తోసిపుచ్చారు. ఆదివారం అసెంబ్లీలో ఈ శాఖల పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు హోం శాఖ పద్దుపై అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానమిస్తూ వివిధ జైళ్ళలో సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీల విడుదలకు చర్యలు తీసుకున్నామని, అయితే దీనికి గవర్నర్ ఆమోదం రావాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు నిర్మించనున్నామని తెలిపారు. నగరంలో అక్రమంగా విదేశీయులు ఉన్నారన్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. పాక్ నుంచి 242 మంది వచ్చినప్పటికీ వారిలో ముగ్గురే వీసా గడువు ముగిసినా ఉన్నారని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి 15 మంది వచ్చినా వారి గడువు ఇంకా ముగియలేదని అన్నారు.