తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో 11 జాతీయ పక్షులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి/ఆత్మకూరు, మే 14: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని పరమేశ్వరస్వామి చెరువు సమీపంలో ఆదివారం సాయంత్రం 11 జాతీయ పక్షులైన నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయ. ఆత్మకూరు ఎస్సై సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఆత్మకూరు పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో ఒకేచోట నెమళ్ల గుంపు స్థబ్ధుగా పడి ఉన్న విషయాన్ని ప్రత్యక్షసాక్షులు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకేచోట 11 నెమళ్లు పడి ఉండడం, అందులో 9 నెమళ్లు మృతి చెందినట్లు, రెండు నెమళ్లు కొనఊపిరితో ఉన్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న రెండు నెమళ్లను వెంటనే ఆత్మకూరులోని ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించేలోపే మృతి చెందాయ. ఒకేచోట నెమళ్లు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లోని వేటగాళ్లు ఏమైనా కలుషిత ఆహారం పెట్టి ఉండవచ్చనే అనుమానంతో విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఎండవేడిమి తట్టుకోలేక ఒకే సారి గుంపుగా వచ్చిన నెమళ్లు మరమేశ్వరస్వామి చెరువులో నీటిని తాగిన వెంటనే కుప్పకూలి ఉండవచ్చనే అనుమానాలను డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏదేమైనప్పటికీ జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో జాతీయ పక్షులు మృతి చెందిన విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి చేరవేయడంతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. నెమళ్లను ఆత్మకూరులోని ప్రభుత్వ పశువైద్యశాలలో ఉంచామని, సోమవారం అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.

చిత్రం..అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నెమళ్లు