తెలంగాణ

ప్రజల గొంతుకగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ జెఎసి ప్రజల గొంతుకగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం నగరంలో జరిగింది. ఇంతకాలం తమతో కలిసి పని చేసిన మిత్రుల అభిప్రాయాలను గౌరవిస్తామని, ఉద్యోగుల సమస్యలపై అవసరం అయితే వారికి అండగా నిలుస్తామని అన్నారు. నిర్మాణాత్మక వైఖరితో ప్రజలతో గతంలో పని చేసినంత చురుగ్గా పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులను, ప్రజలకు ప్రయోజనం కలిగే పనులను మెచ్చుకుంటాం, ప్రజలకు నష్టం కలిగించే పనులు ఉంటే పోరాటం చేస్తామని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షుణ్ణంగా అధ్యయం చేయనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ ఐదు, ఆరు తేదీల్లో ఆదిలాబాద్‌లో పర్యటించి కరవు పరిస్థితులను పరిశీలించనున్నట్టు చెప్పారు. అదే విధంగా 11న నిజామాబాద్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై ఉద్యమిస్తామని చెప్పారు. సమస్యల వారీగా జెఎసి ఉద్యమిస్తుందని, సమస్యల వారీగా తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోతామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయంపై ప్రభుత్వం మరింతగా దృష్టిసారించాలని, ఇరిగేషన్ , యువకులకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ఉచిత సేవలు మరింతగా పెరగాలని కోరారు. గ్రూప్ 2 పోస్టులు కనీసం 2 వేలు ఉండాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, ఎక్సైజ్ శాఖతో పాటు పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని కోదండరామ్ కోరారు. గోదావరి జలాలను సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టిజెఎసిని మొదటి నుంచి అలాగే వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పారు. కొందరు రాజకీయ జెఎసి అని వ్యవహరిస్తున్నారని, టిజెఎసిగానే పిలవాలని కోదండరామ్ కోరారు.
హెచ్‌సియులో విద్యార్థులు, అధ్యాపకులపై లాఠీచార్జీని ఖండిస్తున్నట్టు తెలిపారు. బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లోకి సాయుధ బలగాలు వెళ్లవద్దని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు.