తెలంగాణ

బెడిసికొట్టిన ప్రభుత్వ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ధర్నా చౌక్‌లో సోమవారం ఒక్క రోజు నిరసన ధర్నా నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వ వ్యూహం బెడిసి కొట్టింది. పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్క రోజు నిరసన ధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రకటించారు. కాని, ఇం దిరా పార్కు నుంచి ధర్నా చౌక్‌లోకి వెళ్ళే రోడ్డు మార్గాన్ని పోలీసులు మూసి వేశారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కొద్ది మంది వామపక్షాల కార్యకర్తలు అక్కడికి చేరుకున్నప్పుడు వారిని అనుమతించిన పోలీసులు ఆ తర్వాత వచ్చిన వారిని ససేమిరా అనుమతించలేదు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ధర్నా చౌక్‌కు ఎల్‌ఐసి కార్యాలయం వైపు నుంచి వచ్చే దారిలో భారీ షామియానాలు, వందల సంఖ్యలో కుర్చీలు వేశారు. ఈ షామియానాలు, కుర్చీలు ధర్నా చౌక్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్న వారే ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నా, స్థానికులు మాత్రం ఆ దరిదాపుల్లో పెద్దగా కనిపించలేదు. అక్కడ కూర్చున్న వారిలో ఎక్కువ మంది మఫ్టీలో ఉన్న పోలీసులేనని మీడియా ప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు గుర్తించారు. లేక్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి 20 మంది మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో అక్కడికి చేరుకొని, ధర్నా చౌక్ వద్దు, ఇందిరా పార్కు ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. వారిని ఎలక్ట్రానిక్ మీడియా చిత్రీకరించడంతో వారు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అలాగే అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేత ఒకరు తన కళాశాల నుంచి సిబ్బందితో పాటు ఉప్పల్, ఎల్‌బి నగర్, కంటోనె్మంట్ ప్రాంతాలకు చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్తలను స్థానికులకు మద్దతుగా తీసుకు వచ్చారు. ఇలా ధర్నా చౌక్ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారులకు అనుమతించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా, స్థానికుల సంఖ్య చాలా పలచగా కనిపించింది. స్థానికులు చాలా మంది తమకు చల్లటి మంచి నీరు సరఫరా చేశారని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు.