తెలంగాణ

కార్పొరేట్ కోరల్లో విద్య, వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: అత్యంత కీలకమైన విద్య, వైద్యం కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, వీటికి ప్రభుత్వ రంగంలో ప్రోత్సాహం కల్పించాలని వివిధ పార్టీల శాసన సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. విద్య, వైద్యం వంటి పలు అంశాల పద్దులపై సోమవారం శాసన సభలో చర్చ జరిగింది. ప్రధానంగా విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘వైద్యం కార్పొరేట్ హాస్పటల్స్ చేతిలోకి వెళ్లింది, విద్య కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాల చేతిలోకి వెళ్లింద’ని బిజెపి సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, హైస్కూళ్లు సంఖ్య ఏటేటా తగ్గుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు ప్రైవేటు వారి కన్నా మూడింతలు ఉంటాయని, శిక్షితులై ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారికన్నా ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతూ ఎంసెట్ అవసరమా? అని ప్రశ్నించారు. ఎంసెట్ పేరుతో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
అనేక పాఠశాల్లో కనీస సౌకర్యాలు లేవని, ఉపాధ్యాయులు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో దేశంలోనే తక్కువ అక్షరాస్యత ఉందని అన్నారు. గతంలో నియమించిన ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. మండలంలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తెలిపారు. తాము సభలో మాట్లాడుతున్నది మంత్రులు నోట్ చేసుకోవడం లేదని అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకుంటూ విద్యామంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో ఉన్నారని, అధికారులు నోట్ చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు. 21 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో చేసింది ఏమీ లేదని అరుణ అన్నారు. కెజీ నుంచి పీజి వరకు ఉచిత విద్య ఒక్క హామీ మినహా మిగిలిన అన్నీ అమలు చేసినట్టు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారని, కానీ విద్యారంగానికి సంబంధించి 35 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో విద్యా రంగం అస్తవ్యస్థంగా ఉండేదని అన్నారు. కాలేజీ భవనం నిర్మించడానికి అనుమతి మంజూరు చేశారు, కానీ అందులో కాలేజీ ఏర్పాటు చేసేందుకు కావలసిన వౌలిక వసతులు, ఉపాధ్యాయ పోస్టులను మాత్రం మంజూరు చేయలేదని ఇదీ కాంగ్రెస్ పాలన తీరు అని విమర్శించారు.
రైతుల ఆత్మహత్యలకు విద్య కోసం చేసిన అప్పులు కూడా ఒక ప్రధాన కారణమని టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలో ప్రకటించారని, 15,600 పోస్టులకు అనుమతి ఇచ్చి తీరా ఇప్పుడు పదివేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్నారని అన్నారు. మహిళా టీచర్లు సక్రమంగా స్కూల్‌కు రావడమే కాకుండా బాగా పాఠాలు చెబుతున్నారని, 50 శాతం మంది మహిళా టీచర్లనే నియమించాలని కోరారు. మహిళా టీచర్లకు ఇప్పుడున్న 30 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విద్య, వైద్యంను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. సిపిఐ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్యా రంగంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని అన్నారు. కొటారీ కమీషన్ నివేదిక ప్రకారం 30 శాతం నిధులు విద్యకు వ్యయం చేయాల్సి ఉండగా, బడ్జెట్‌లో పది శాతం కూడా కేటాయించడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 3300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారని తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.