తెలంగాణ

మహిళల వేధింపులపై చట్టాలు మరింత కఠినతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: లింగ నిర్థారణ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినతరమైన చట్టాలు చేయాలని వివిధ మహిళా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం ‘గ్రామ్య’ మహిళా సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ వి.రుక్మిణీ రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం, ఆస్ట్రేలియాకు చెందిన మహిళా నాయకురాలు లినోట్, భూమిక-ఫెమినిస్టు మ్యాగజైన్, మహిళల హక్కుల ఉద్యమ నాయకురాలు కె. సత్యవతి, మహిళా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన మహిళా నాయకురాలు లినెట్ ప్రసంగిస్తూ మహిళల సంఖ్య తగ్గుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. లింగ వివక్ష లేకుండా ప్రభుత్వాలు కఠినంగా ఉండాలని కోరారు.
మెగసెస్ అవార్డు గ్రహిత శాంతాసిన్హా ప్రసంగిస్తూ పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో మహిళల సంఖ్య తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల సంరక్షణ కమిటీలను మరింత పటిష్టం చేయాలని, లైంగిక వేధింపులను నిరోధించాలని కోరారు. భూమిక-ఫెమినిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కె.సత్యవతి ప్రసంగిస్తూ మహిళల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదని విమర్శించారు. బ్రూణహత్యలు అనరాదని, ఆడపిల్లల హత్య అని ఆమె తెలిపారు.
లోగడ ‘వైద్యోనారాయణ’ అంటే.. నేడు ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. తెలంగాణలో వెయ్యి మంది పురుషులుంటే మహిళలు 874 ఉండడం ఆందోళనకరమైన అంశమని అన్నారు.
ఎన్‌డిటివీ జర్నలిస్టు ఉమా సుధీర్ ప్రసంగిస్తూ ఆడపిల్లలు పుట్టారని, రెండో వివాహాలు చేసుకున్న దాఖలాలున్నాయని అన్నారు. సంధ్య మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ప్రభుత్వం రూ.75 వేలు చెల్లిస్తే, ఆ డబ్బును పెళ్ళికుమారునివారే అడుగుతున్నారని చెప్పారు. జర్నలిస్టు రజిత మాట్లాడుతూ లైంగిక వేధింపుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని డిమాండ్ చేశారు. సివిల్ సొసైటీ ప్రతినిధి రిజ్వాన్ పర్వేజ్ ప్రసంగిస్తూ లింగ నిర్థారణ చేయకుండా అల్ట్రాసౌండ్ కేంద్రాలపై కనే్నసి ఉంచాలన్నారు. వరకట్నం పూర్తిగా పోవాలని, మహిళలకూ సమాన చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు. యుఎన్ ఉమెన్ ప్రతినిధి సాన్యసేత్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సదస్సులో ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టివీ1 న్యూస్ రీడర్ వై.పద్మావతి, మహబూబ్‌నగర్‌కు చెందిన సామాజికవేత్త లక్ష్మణ్‌రావు, కల్పనా కుమారి, హైదరాబాద్ పాతనగరానికి చెందిన జమీలా, జర్నలిస్టులు క్రాంతి, శ్రీనివాస్, ఇందిర తదితరులు ప్రసంగిస్తూ లింగ నిర్ధారణ జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రోజంతా జరిగిన సదస్సుకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.