తెలంగాణ

మూడేళ్ళలో ఆరు దశాబ్దాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 9: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి, కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మూడేళ్ళలో జరిగిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ అన్నారు.
ఎన్డీఏ ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న పాలనకు మూడేళ్ళు గడిచిన నేపథ్యంలో కేంద్రం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు మేకింగ్ ఆఫ్ డెవలప్‌డ్ ఇండియా (మోదీ) ఫెస్ట్ పేరిట శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లో అధికారికంగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత పాలకుల వైఫల్యాలతో అన్ని రంగాల్లో దేశం వెనుకబాటుకు గురికాగా, ప్రధాని మోదీ పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ గాడిన పెడుతూ సమర్ధవంతమైన పాలన కొనసాగిస్తున్నాడని కొనియాడారు. దోచుకో.. దాచుకో.. అనే రీతిలో గత పాలకులు వ్యవహరించటంతో 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం, భూ మాఫియాలతో దేశం కునారిల్లిందని, అయితే, ఎన్‌డిఏ ప్రభుత్వం చేపట్టిన వేలం విధానంతో రూ.5.69లక్షల కోట్ల ఆదాయం రాగా, దేశం అవినీతి రహిత సమాజం దిశగా అడుగులు వేస్తోందన్నారు. సామాన్యుడి నుంచి ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికో రేటు నిర్ణయించే విధానం అమల్లో ఉండగా, కేంద్రం తీసుకొచ్చిన ఈ-గవర్నెన్స్ విధానం అక్రమాలకు చెక్ పెట్టిందన్నారు. పారదర్శకత విధానం పెరిగి అట్టడుగువర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యం గా ఎన్‌డిఏ ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే బ్యాంకు ఖాతాల్లేని 28కోట్ల మందికి జీరో ఖాతాలు, 13కోట్ల మందికి సామాజిక బీమా సురక్ష పథకం, 7.5కోట్ల మందికి ముద్ర రుణాలు కేంద్ర ప్రభుత్వం అందించినట్లు వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా నీటిపారుదల, బీమా, సంస్థాగత రుణాల సౌకర్యాలపై దృష్టిసారించినట్లు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అతితక్కువ ప్రీమియంతో గరిష్ట బీమా వర్తింపజేస్తుందని తెలిపారు. ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటంలో గత పాలకులు నిర్లక్ష్యం వహిస్తే, మూడేళ్ళ కాలంలో ప్రధాని మోదీ వంద దేశాలతో స్నేహ హస్తం చాచాడని అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్‌డిఏ ప్రజలకిచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు మోదీ ఫెస్ట్ పేరిట దేశవ్యాప్తంగా 900 పట్టణాల్లో ముఖ్య నాయకులతో సభలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సభలో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.

చిత్రం.. మోదీ ఫెస్ట్‌లో ప్రసంగిస్తున్న హర్యానా సిఎం మనోహర్‌లాల్ కట్టర్