తెలంగాణ

నీటి రంగానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 9: గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని, దీనిని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 240 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. జిల్లా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. కొత్తగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిల్ల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయన్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విషయం గమనించాలన్నారు. దేశానికే మార్గదర్శకంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు నిలిచాయన్నారు. ఇంటింటికీ తాగునీరు, లక్ష ఎకరాలకు సాగునీరందించే ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇతర రాష్ట్రాలు అభినందిస్తుంటే స్వరాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కనిపించకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను అందజేయడం వల్ల రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావుల కింద రైతాంగం రెండు పంటలను పండించుకోగల్గుతున్నారన్నారు. వచ్చే ఏడాది నుండి ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడిని కూడా ప్రభుత్వమే భరించనుందన్నారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా గత యాసంగి పంట దిగుబడులు దాదాపు లక్ష టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలుచేశామని మంత్రి తుమ్మల అన్నారు. ఎంఎస్‌పి ఉన్న ప్రతి పంటకు మద్దతు ధరను కల్పిస్తున్నామని తెలిపారు.
ఇది స్వర్ణయుగం...
తెలంగాణ రాష్ట్రానికి మరో కాశ్మీరంగా ఆదిలాబాద్‌ను అభివర్ణించే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నారని మంత్రి తెలిపారు. కొండలు, కోనలు, వాగు లు, వంకలతో ఎంతో సుందరంగా ఉండే ఆదిలాబాద్ ప్రాంతం రవాణా పరంగా కొంత వెనుకబడిందని, దానిని అధిగమించేందుకు రూ.240 కోట్ల నిధులను ముఖ్యమంత్రి మం జూరుచేశారన్నారు. ఈ నిధులతో మా రుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టమే కాకుండా అవసరమైనచోట్ల రూ.83 కోట్ల నిధులతో బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయనున్నామన్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు స్వర్ణయుగమని అభివర్ణించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని రోడ్లు, భవనాల కోసం మరిన్ని నిధు లు మంజూరుచేయాలని కోరా రు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో రింగురోడ్డును మంజూరుచేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరినందున దీని ఆవరణలోనే మరో నూతన భవనాన్ని నిర్మించేందుకు నిధులు కేటాయించాలన్నారు. అలాగే సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు చించోలి గ్రామం వద్ద ఇరుకైన రోడ్డు ఉన్నందున ఆ గ్రామానికి బైపాస్ రోడ్డును ఏర్పాటుచేసేందుకు నిధులు మంజూరుచేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జోగురామన్న, ఎంపి నగేష్, జడ్పీ ఛైర్మెన్ శోభారాణి సత్యనారాయణగౌడ్, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖాశ్యాంనాయక్, జిల్లా కలెక్టర్ ఇలంబరిది, జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.

చిత్రం.. నిర్మల్‌లో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న