తెలంగాణ

కెటిఆర్ వస్తే రాళ్లతో కొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 11: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దగ్గరికి కెటిఆర్ వస్తే నారాయణపేట, కొడంగల్ ప్రజలు రాళ్లతో కొట్టాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోని తాగునీటి పథకాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నిర్మించిన కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ నీటి పథకాలకు సంబందించిన ట్యాంకులను, పంపులను పరిశీలించారు. కోయిల్‌సాగర్ కొండలపైకి ఎక్కి కొండపై నిర్మించిన ట్యాంకును కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2011 సంవత్సరంలో రూ.350 కోట్లతో మూడు నియోజకవర్గాలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకువచ్చానని తెలిపారు. అయితే ఈ పనులు అప్పటినుండి కొనసాగి ట్యాంకులు కూడా నిర్మించారని, 210 గ్రామాలు 8 లక్షల మంది జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. అయితే ఇందులో కొడంగల్ నియోజకవర్గానికి సంబందించిన రూ.70 కోట్ల తాగునీటి పథకాన్ని కెసిఆర్ తొక్కిపెట్టారని ఆరోపించారు. ఎవరి దొడ్లగేదె పుడితే ఆ దూడ తమదే అన్న చందంగా కెసిఆర్ భావించుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కెసిఆర్ చేసిన ద్రోహం ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గానికి రూ.1500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేస్తూ జిఓ 69ను విడుదల చేసిందని, అయితే ఈ ప్రాజెక్టు నిర్మించకుండా కెసిఆర్ ఆపారని, ఇంత దుర్మార్గుడు ఎక్కడా ఉండడని ధ్వజమెత్తారు.