తెలంగాణ

నేడు గెజిట్ కాపీల దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: పశువుల క్రయ, విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించినందుకు నిరసనగా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా గెజిట్ కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలంగాణ రైతు సంఘం ప్రకటించింది. కేంద్రం గత నెల 23న అమల్లోకి తెచ్చిన విధి విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రైతాంగానికి కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు మరింత ఇబ్బంది అవుతుందని తెలిపారు. రైతుల నుంచి పశువులను దూరం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధానాన్ని తీసుకు వచ్చారని అన్నారు. పశువులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదని, పెట్టుబడి ఖర్చు పెరిగి వ్యవసాయం మరింత భారం అవుతుందని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే దురాలోచనతోనే కేంద్రం ఈ విధానాన్ని తీసుకు వచ్చిందని అన్నారు. ఇందుకు నిరసనగానే తాము గెజిట్ కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.