తెలంగాణ

రుణ ప్రణాళిక ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలో ఆగమై పోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిఎం కెసిఆర్‌ను టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అంటూ పదే పదే చెబుతున్న మీరు రైతల వాస్తవ సమస్యలేమిటో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని కోరుతూ ఆదివారం రేవంత్ రెడ్డి సిఎంకు బహిరంగ లేఖ రాశారు. తక్షణమే అత్యవసరంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బిసి)ను ఏర్పాటు చేసి రుణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వడ్డీతో సహా చెల్లించడమే కాకుండా నాలుగో విడత రుణ మాఫీ మొత్తాన్ని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. కౌలు రైతులకూ రుణాలు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని, సబ్సిడీ విత్తనాలు రైతులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిసాన్ కార్డు, రూపేకార్డు ఉన్న వారికి మాత్రమే రుణాలు ఇస్తామన్న నిబంధనను ఈ ఏడాదికి సడలించాలని కోరారు. విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా, ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల కోసం రైతులు ఎగబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.