తెలంగాణ

రైతులతో సమానంగా కౌలుదారులకూ రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు ప్రారంభమైనందున రైతులకు వెంటనే రుణాలు, విత్తనాలు, సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కౌలుదారులకు బ్యాంకు రుణాలు, రైతులకు ఇచ్చే అన్ని రాయితీలు అం దేలా చూడాలని కమిటీ డిమాండ్ చేసింది.
పార్టీ నాయకుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణ అర్హ త కార్డులు ఇవ్వాలని, రుణ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేసింది. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంతో పాటు అనే క వ్యాపారాలు కలిగి ఉన్న ధనిక, భూస్వామ్య, పెట్టుబడిదారీ రైతులకే బ్యాంకులు అత్యధిక రుణాలు ఇస్తున్నాయని, చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులకు నామమాత్రపు రుణాలు ఇస్తున్నందున, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో వచ్చిన వర్షాలను వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి రైతు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు అభివృద్ధి అయ్యేలా ప్రభు త్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది.