తెలంగాణ

వేతనాలు పెంచకుంటే సమ్మెకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: వేతనాలు పెంచకపోతే మరో సమ్మెకు సిద్ధమవుతామని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు జులై 3న ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్క ర్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. జులై 18 నుంచి ఐదురోజు పాటు సమ్మె నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేశారు. జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మాదిరిగానే తమకూ వేతనాలు పెంచాలని, విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లుగానే పిఎఫ్ ఆధారంగా పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆదివారం నాడిక్కడ సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం వేతనాలు పెంచకపోతే దశల వారీగా పోరాటాన్ని ఉద్ధృతం చేసి, చివరకు సమ్మె కు దిగాల్సి వస్తుందని సదస్సులో పాల్గొ న్న పలువురు వక్తలు పేర్కొన్నారు.