తెలంగాణ

ఒయులో అడుగుపెట్టగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో అడుగు పెట్టే ధైర్యం లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సిఎం వ్యవహార శైలి ఒయు విద్యార్థులపై కక్ష కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను అణచివేసేందుకే ఒయులో నిషేదాజ్ఞల జివో ను జారీ చేశారని అన్నారు. ఒయు విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నామని, అప్పుడు అవసరమైన విద్యార్థులు ఇప్పుడు అవసరం లేదా అని జగ్గారెడ్డి నిలదీశారు. ఒయులో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం దుర్మార్గమని అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒయులో సభ నిర్వహిస్తే పాల్గొంటారని వెల్లడి కావడంతోనే నిషేదాజ్ఞలు విధించారని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు సిఎం కెసిఆర్‌కు తగి న బుద్ధి చెబుతారని తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒయులో సమావేశం నిర్వహిం చి తీరుతామని జగ్గారెడ్డి ప్రకటించారు. ఒయు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి: మల్లు రవి
మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్య లు చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీని కులంతో ముడిపెట్టి వ్యాఖలు చేసిన అమిత్‌షా క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేశం యావత్తు మహాత్ముడికి ఎంతో గౌరవం ఇస్తుంటే, బిజెపి మాత్రం లౌకిక వాదానికి, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పని చేస్తోందని విమర్శించారు.