తెలంగాణ

హైదరాబాద్‌లో హైఅలర్ట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్ము,కశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తునారని, హైదరాబాద్, బెంగుళూరు టార్గెట్‌గా దాడులకు దిగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ అలర్టయింది. రంజాన్, బోనాల వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ముష్కర మూకలు మరోసారి అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా భద్రతను పెంచారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో భద్రతను మరింత పటిష్టం చేశారు. సైబరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చన్న సమాచారంతో ఎక్కడిక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెలాఖరు వరకు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులకు సూచించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల టార్గెట్ ఐటీ జోన్‌గా తెలుస్తుండటంతో మాదాపూర్, హైటెక్ సిటీ పరిధిలోని పలు మాల్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల జమ్ము,కశ్మీర్‌లోని పోలీస్ పికెట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో రషీద్ అనే సూత్రధారి అక్కడిపోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్న రషీద్‌ను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకు జమ్ము,కశ్మీర్ పోలీస్ పికెట్‌పై దాడికి పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంతే కాకుండా లష్కరే తోయి బా టార్గెట్‌లో హైదరాబాద్, బెం గుళూ రు నగరాలు ముందు వరసలో ఉన్నట్టు గుర్తించారు. ఐటీ సంస్థలతోపాటు మా ల్స్ టార్గెట్‌గా విధ్వంసం జరపడానికి పథకం చేసినట్టు రషీద్ అంగీకరించినట్టు తెలిసింది. రషీద్ విచారణలో తేలి న అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర నిఘా విభాగ సంస్థ హైదరాబాద్ పోలీ స్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. నెలాఖరు వరకు ముఖ్యంగా వీకెండ్స్ సమయాల్లో అప్రమత్తంగా వ్యవహిరించాల్సిందిగా సూచించింది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్ సహ పలు మాల్స్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల తో తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నా రు. ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉన్న వారి ని మాత్రమే మాల్‌లోకి అనుమతిస్తున్నా రు. ఈ నెలాఖరు వరకు సైబరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, రంజాన్, బోనాల సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సికిందరాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచామని, అనుమానితులను తనిఖీ చేస్తున్నట్టు రైల్వే డిజి (శాంతిభద్రతలు) టి ప్రసాదరరావు తెలిపారు.

చిత్రం.శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర బలగాలు