తెలంగాణ

విద్యాభివృద్ధితోనే పేదరికం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 11 : తెలంగాణ సర్కార్ మైనార్టీ ల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొండ భూదేవి ఫంక్షన్ హాల్ లో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని పేద మైనార్టీలకు జకత్ కింద నిత్యావసర సరుకులను ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌తో కలసి పంపిణీ చేశా రు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి కొత్త దుస్తులు పంపిణీ చేసి, ఇఫ్తార్ విందు లు నిర్వహిస్తుందని అన్నారు. మైనార్టీల విద్యాభివృద్ధి కోసం 4 వేల కోట్లతో 200 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. మైనార్టీలు తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, విద్యాభివృద్ధితోనే పేదరికం దూరమవుతుందని అన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్లలో ఉర్దూతో పాటు, ఆంగ్ల మీడియంలో బోధించనున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీలు తమ ఉజ్వల భవిష్యత్తుకు మాతృభాష ఉర్దూతో పాటు ఆంగ్లం భాషను అభ్యసించాలన్నారు. ప్రతి విద్యార్థిపై సర్కార్ 80 వేల రూపాయలు ఖర్చుపెడుతోందని, మైనార్టీలు రెసిడెన్సియల్ స్కూళ్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనార్టీలు సర్కార్‌కు అండగా నిలవాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మైనార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హరితహారం విజయవంతానికి కృషిచేయాలన్నా రు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు, సం రక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి సర్కార్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం పేద ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర వస్తువులను మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మ న్ సారయ్య, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఓఎస్‌డి బాలరాజు కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, శ్రీనివాస్ యాదవ్, వజీర్, మోయి జ్, జావేద్, నాయకులు బ్రహ్మం, నాగరాజు, ఆనంద్, రాజు, లియాఖత్‌హుస్సేన్, హమీద్ పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు