తెలంగాణ

169 గురుకుల విద్యాలయాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజుననే 169 గురుకుల విద్యాలయాలు ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఇన్ని గురుకుల విద్యాలయాలు ప్రారంభం కావడం చరిత్రలో రికార్డు ఆయన అన్నారు. కెజి టు పిజి విద్యను ప్రవేశపెడుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీకి గురుకుల విద్యాలయాల ప్రారంభంతో అంకురార్పరణ జరిగిందన్నారు. సోమవారం రాష్టవ్య్రాప్తంగా గురుకుల విద్యాలయాలు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రారంభించిన 169 గురుకుల విద్యాలయాలలో 119 బిసి, 50 మైనార్టీలకు కేటాయించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15న మరో 50 బిసీలకు, 19న మరో 21 మైనార్టీలకు సంబంధించిన గురుకుల విద్యాలయాలు ఉన్నాయన్నారు. ఇవే కాకుండా 15 గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలను ఇదే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఎస్సీలకు 134, ఎస్టీలకు 94, బిసిలకు 19గురుకుల విద్యాలయాలు మాత్రమే ఉండేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీలకు 104, ఎస్సీ మహిళలకు 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీలకు 51, ఎస్టీ మహిళలకు 15 డిగ్రీ కాలేజీలు, బిసీలకు 124, మైనార్టీలకు 71కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా 169 గురుకుల విద్యాలయాలు ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడమే లక్ష్యమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కెజి టు పిజి విద్యను అందిస్తామని ఇచ్చిన హామీలో భాగమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు కలిపి కేవలం 259 గురుకుల విద్యాలయాలు మాత్రమే ఉండగా, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లలో కొత్తగా 527 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు.గురుకుల విద్యాలయాలలో చదువుకునే ఒక్కో విద్యార్థికి ఏడాదికి సగటున రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. గురుకుల విద్యాలయాలలో ఇంటర్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతీ సౌకర్యాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.