తెలంగాణ

పలకరించిన రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: నైరుతి రుతుపవనాలు తెలంగాణను సోమవారం తాకడమే కాకుండా రాష్టవ్య్రాప్తంగా ఒకేరోజు విస్తరించాయి. సాధారణంగా తెలంగాణ సరిహద్దులో ఉండే జోగులాంబ గద్వాల జిల్లాను రుతుపవనాలు తాకిన తర్వాత రెండు, మూడు రోజులకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈ సంవత్సరం రుతుపవనాలు ఒకేరోజు రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా, రాష్టవ్య్రాప్తంగా విస్తరించాయి. రానున్న రెండురోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. గత 24 గంటల్లో ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ (పాత జిల్లాల పరిధి) తదితర జిల్లాల్లోని చాలా చోట్ల వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా చంద్రుగొండలో ఆరు సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా నల్లబెల్లి, నిజామాబాద్ జిల్లా రెంజల్, రుద్రూర్, పాల్వంచ (ఖమ్మం) లలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఒకటి నుండి నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా మొన్నటి వరకు గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు నమోదైన ప్రాంతాల్లో ప్రస్తుతం 34-35 డిగ్రీల సెల్సియస్ గరిష్టంగా నమోదవుతోంది. ఖమ్మం, భద్రాచలంలలో 35 డిగ్రీలు గరిష్టంగా నమోదైంది.