తెలంగాణ

రాష్ట్రంలో భూ మాఫియా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియా పరిపాలన సాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. పోడు భూములను లాక్కునే ప్రభుత్వాన్ని పాతరేస్తామని హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులు మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దళిత, గిరిజన పోడు పోరు యాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. రూ.70వేల కోట్ల మేరకు బ్యాంకుకు అప్పులున్న ఆదాని కార్పొరేట్ సంస్థను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందన్నారు. సంపన్న వర్గాలకు రూ.13.50లక్షల కోట్ల మేర కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. తెలంగాణలో నరుూం కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఎటువంటి విచారణ చేపట్టడం లేదని విమర్శించారు. మంత్రులు, శాసన సభ్యులు నరుూంకు అంటగాగటం వల్లనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మాఫియా మంత్రులున్న కెసిఆర్ కేబినెట్‌తో బంగారు తెలంగాణ రాష్ట్రం ఏలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థతోపాటు బహుళజాతి కంపెనీలకు సహజ సంపదను దోచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌లు వంత పాడుతున్నారని ఆరోపించారు. గోవధ నిషేధం పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలు, గిరిజనులు, దళితుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు టివి చౌదరి, జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా పాల్గొన్నారు.