తెలంగాణ

తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఖ్యాతి గడించారని, ఇక్కడి పోలీస్ శిక్షణ పలు రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదిభట్ల నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన డిజిపి అనురాగ్‌శర్మ, కమిషనర్లు మహేశ్ ఎం భగవత్‌లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ, తెలంగాణలో పోలీసులు సమిష్టి కృషితో నేరాలను అదుపు చేయగల్గుతున్నారని, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. పోలీసులకు కావలసిన అన్ని అవసరాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆధునిక టెక్నాలజీతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ముందుకెళ్తుందన్నారు.
నేరరహిత తెలంగాణ సాధించాలని సీఎం కోరుకుంటున్నారని, ఆ దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని మంత్రి నాయిని తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, శాంతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం.. ఆదిభట్ల పిఎస్ నూతన భవనాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి