తెలంగాణ

వేటగాళ్ల కోసం వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో రెచ్చిపోతున్న అడవి దొంగలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా అడవుల్లోని జంతువులను వేటాడుతున్న వేటగాళ్లను అడ్డుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి దీనిపై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. తరుచుగా జంతువులను వేటాడే అటవీ ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా చర్యలు ఎక్కువ చేస్తారు. వేటగాళ్ల సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. రాష్ట్రంలోని ఒక్కో అభయారణ్యానికి ఒక సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల వేటకు సంబంధించి కేసులను సత్వర పరిష్కారం కోసం స్వచ్ఛందంగా పనిచేసే న్యాయ సలహాదారులను కూడా నియమించాలని అటవీశాఖ నిర్ణయించింది.
అటవీ సంరక్షణ కోసం సోమవారం నిర్వహించిన సమావేశంలో వన్యప్రాణుల పరిరక్షణపై చర్చించారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటి, అడవుల్లో జంతువులు తాగునీటి కోసం చాలా ఇబ్బంది పడ్డాయని, రక్షిత అడవుల్లో నీటి వసతి కల్పనకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి పికె ఝా తెలిపారు. ఈ వేసవిలో కృత్రిమ నీటి వనరులను ఏర్పాటు చేసి జంతువులను రక్షించినట్టు, అందువల్లనే అంత ఎండల్లోనూ అడవి జంతువులు అడవిని వదిలి బయటకు రాలేదని చెప్పారు. వచ్చే యేడు వేసవి నాటికి అడవులను మ్యాపింగ్ చేసి, నీటి వనరులు మరింతగా జంతుజాలానికి అందుబాటులోకి తీసుకు రానున్నట్టు చెప్పారు. చిన్న చెక్ డ్యామ్‌లు, సాసర్ ప్లేట్లు నిర్మిస్తామని చెప్పారు. వన్యప్రాణులు తినే గడ్డిని విరివిగా అడవుల్లో పెంచే చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అడవులు, పర్యావరణానికి ఇబ్బంది కలగని రీతిలో టూరిజం శాఖ పనులను ప్రభుత్వ పరంగా అనుమతులు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. టూరిజం పేరుతో ప్రజలను అడవుల్లోకి అనుమతించడం పై స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఆదిలాబాద్ ఇజల్లా కుంటాల, కడెం అటవీ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇది పర్యావరణానికి ముప్పుగా మారుతుందని వివిధ సంస్థల ప్రతినిధులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున షాపులు, హోటళ్లు వెలిశాయని, దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలో వ్యాపిస్తున్నాయని, దీనిని అరికట్టాలని కోరారు. జాతీయ పార్కుల్లో నేచర్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులు, చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణులపై ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. అరణ్యభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అదనపు అటవీ శాఖ సంరక్షణాధికారులు డాక్టర్ మనో రంజన్ భాంజా, మునీంద్ర పాల్గొన్నారు.

వారి కబ్జాలు బయటికొస్తాయని భయం