తెలంగాణ

ఇక ఆన్‌లైలో పశు విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం వినూత్న పద్ధతిలో పశువుల అమ్మకం, కొనుగోలుకు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ తరహా విధానంలో క్రయవిక్రయాలు చేపట్టలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టమవుతోంది. నేషనల్ ఇన్‌ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) సహకారంతో పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రైతులు పశువులను అమ్మాలన్నా, కొనాలన్నా పశుసంతలకు వెళుతున్నారు. 50-100 గ్రామాలకు ఒక చోట వారానికి ఒక సారి పశువుల సంతలు జరుగుతున్నాయి. రైతులు తమ పశువులను అమ్ముకోవాలంటే ఈ సంతలకు వెళ్లి రోజంతా ఎదురు చూడాల్సి వచ్చేది. పశువులు అమ్మకం కాకపోతే తిరిగి తమ తమ గ్రామాలకు పశువులను తీసుకుని వెళ్లి మరో పర్యాయం సంతకు వెళ్లాల్సి వచ్చేది.
రైతులు పడుతున్న ఈ బాధను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పశువుల క్రయవిక్రయాలను చేపట్టింది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా సోమవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
పశువులను అమ్మేందుకు ముందుకు వచ్చే రైతులు తమ పశువుల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్యాయం నమోదైన వివరాలు నెలరోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంటాయి. కొనుగోలు చేయాలనుకున్నవారు వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు ఇష్టమైన పశువులను కొనుక్కోవచ్చు. ఒక రైతు ఐదు సార్లు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. పశువులను అమ్మేవారికి, కొనేవారికి ఈ వెబ్‌సైట్ ఒక వేదికగా ఉంటుందని ఆయన వివరించారు. అమ్మేవారు, కొనేవారు సంతలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే క్రయ విక్రయాలు చేసుకోవచ్చని వివరించారు. వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సురేష్‌చందా, వెంకటేశ్వర్లుతో పాటు గొర్రెల పెంపకం దారుల సహకార సమాఖ్య ఎండి డాక్టర్ వి. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో పశు బజార్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న అధికారులు