తెలంగాణ

నరుూం డెన్‌పై అనుమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ నరుూం ఇంట్లోని డెన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ జరుపుతున్న దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. రహస్యంగా ఉన్న డెన్‌లో తుపాకులు, ఆయుధాలే కాదు.. బుల్లెట్లతోపాటు పలువురు ప్రముఖల పేర్లతో ఉన్న మరో డైరీ లభ్యమైనట్టు తెలిసింది. వీరిలో మరో ఆరుగురు పోలీస్ అధికారుల పేరున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా నరుూం పాత, కొత్త ఇళ్లల్లో పోలీసులు జరిపిన సోదాల్లో ఏకె 47 గన్‌తోపాటు బుల్లెట్లు కనుగొన్న సంగతి తెలిసిందే. నరుూం నిరుడు అగస్టు 8న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం విధితమే. నరుూం నేర సామ్రాజ్యంపైనే దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాపై ఆరా తీస్తున్నారు. నరుూం నేర సామ్రాజ్యం గురించి తెలిసినా.. ఇంతవరకు పెద్దమొత్తంలో తూటాలు, ఆయుధాలు బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పట్లో నరుూంకు సంబంధించి అక్రమ భూకబ్జా దస్తావేజులు, కొంత నగదుతోపాటు బంగారు ఆభరణాలను పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో 148మందిని అదుపులోకి తీసుకోగా 94కేసులు నమోదయ్యాయి. అయితే నరుూం డెన్‌పై అనేక అనుమానాలు వస్తున్నాయి. నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమై పది నెలలు కావస్తున్నా..కేసు దర్యాప్తులు, నామమాత్రపు సస్పెన్షన్‌లతోనే సరిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే తాజా తనిఖీలు కేవలం నిందితులను తప్పించేందుకేనా? అనే మీమాంస వ్యక్తమవుతోంది. వందల సంఖ్యలో నరుూం బాధితులు తమ భూములు దక్కుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కేసులో కాలయాపన తప్ప, తమ భూములు తమకు దక్కుతాయో?లేదో? అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. నరుూం ఎన్‌కౌంటర్ జరిగినప్పుడే డెన్‌పై ఆరా తీసిన పోలీసులు తాజాగా తెరపైకి డెన్‌ను తీసుకురావడం ఇది ఉత్తుత్తిదేనని అనుమానాలకు తావిస్తోంది. ఇదిలావుండగా నరుూం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ కేసులో సస్పెండైన పోలీస్ అధికారులు సి శ్రీనివాసరావు, మద్దిలేటి శ్రీనివాసరావు అమెరికా వెళ్లేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీసా కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే వారి దరఖాస్తులను డిజిపి అనురాగ్‌శర్మ హోంశాఖకు పంపినట్టు తెలిసింది. వీరి దరఖాస్తుపై స్పందించిన హోంశాఖ పోలీస్ అధికారుల దరఖాస్తులను పరిశీలిస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై జీఏడి అభిప్రాయం కోరినట్టు విశ్వసనీయ సమాచారం.