తెలంగాణ

108 పేజీలతో శుభలేఖ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 12: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు.. పెళ్లిళ్ల సందర్భంగా సముద్రం లోతులోకి వెళ్లి పెళ్లి చేసుకోవడం, ఆకాశంలో బెలూన్లలో విహారం చేస్తూ పరిణయమాడటం వంటి, పెళ్లిళ్ల సందర్భంగా టెక్నాలజీని ఉపయోగించిన పెళ్లిపత్రికలు పంపిణీ చేయడం వంటి వార్తలు చదువుతున్నాం.. చూస్తున్నాం.. ఇదే తరహాలో వరంగల్ నగరానికి చెందిన ఒక యువకుడి పెళ్లికి కుటుంబ సభ్యులు 108 పేజీల వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి బంధువులకు, మిత్రులకు అందజేస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో శాంతినగర్‌కు చెందిన మెడికల్ ఏజెన్సీ యజమాని కల్వ శివప్రసాద్ కుమారుడి వివాహం ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. పెళ్లికి బందు, మిత్రులను ఆహ్వానించేందుకు ఏకంగా 108 పేజీల పెళ్లిపత్రికను ముద్రించారు. ఈ పెళ్లిపత్రికలో హైదరాబాద్‌లో జరిగే పెళ్లి సమాచారం. 17వ తేదీన వరంగల్‌లో జరిగే రిసెప్షన్ వివరాలతోపాటు పెళ్లిళ్లలో ఆచరించే ఆచార, వ్యవహారాలు, హిందూధర్మం ప్రకారం నిర్వహించే పూజలు, పలువురు దేవుళ్లకు సంబంధించిన స్తోత్రాలు, పలు ఆధ్యాత్మిక సమాచారం, రాశిఫలాలతోపాటు పనిలోపనిగా వరంగల్ నగరానికి సంబంధించి రైల్వే, ఆర్టీసి బస్సుల వివరాలు, బ్యాంకులు, హోటళ్లు, గ్యాస్ ఏజెన్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు, అంబులెన్సులు, నగరంలోని కల్యాణ మండపాల వివరాలు, పోలీసుశాఖకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ఒక కార్డుకు 150 రూపాయల ఖర్చు అయిందని, పెళ్లికోసం 1500 కార్డులు ముద్రించి బంధుమిత్రులకు అందచేస్తున్నామని వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

చిత్రం.. 108 పేజీలతో ముద్రించిన పెళ్లి ఆహ్వానపత్రిక