తెలంగాణ

టెక్నాలజీపై పోలీసులకు నైపుణ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోవడమే కాకుండా, నూతన టెక్నాలజీని గుర్తించే సామర్ధ్యం, నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ పిలుపునిచ్చారు. పోలీస్ అధికారుల్లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడంతోనే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. బుధవారం డిజిపి కార్యాలయంలో జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన వారికి ఆయన ఇంక్రిమెంట్లు, నగదు రివార్డులు ప్రదానం చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి క్రీడల్లో ఆసక్తిని పెంచాలని, సమర్థవంతమైన క్రీడాకారులను తయారు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో షూటింగ్ పోటీలలో వాడే ఆయుధాలు భిన్నంగా ఉంటాయని, అటువంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 2.5 కోట్లు విలువచేసే కావలసిన ఆయుధాలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. క్రీడల్లో తెలంగాణ పోలీస్‌కు దేశంలోనే అత్యధిక పతకాలు లభించడం గర్వంగా ఉందని డిజిపి అనురాగ్‌శర్మ సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కొత్తగా దాదాపు 9వేల పోలీస్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని, వారిలో క్రీడా ప్రావీణ్యం ఉన్న వారిని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. పోలీస్ వృత్తిలో వాడే సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ పోలీస్ మీట్‌లో ప్రదర్శించాలని ఆయన సూచించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది మాట్లాడుతూ, జాతీయ పోలీస్ మీట్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు పారితోషికం, బహుమతుల మంజూరులో ఉదారంగా వ్యవహరించిందని, ప్రతిభగల పోలీస్ అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
స్పోర్ట్స్ అదనపు డిజిపి బాధ్యతలు నిర్వహించే సమయంలో వివిధ క్రీడా బృందాలను తయారు చేసే విషయంలో విదేశాల నుండి ఆయుధాల సేకరణ కోసం చేసిన ప్రయత్నాలను వివరించారు. ఇన్‌చార్జి స్పోర్ట్స్ డిజి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్రీడల్లో ప్రతిభ ప్రదర్శించిన వారికే కాకుండా వారికి శిక్షణ ఇచ్చిన వారికి కూడా బహుమతులు ఇచ్చామన్నారు. 2015-16లో జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు బంగారు, కాంస్య, రజత పతకాలు రావడం గర్వించదగ్గ విషయమన్నారు.

చిత్రం.. జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన పోలీస్ అధికారులకు నగదు ప్రోత్సహకాలు అందజేస్తున్న
డిజిపి అనురాగ్ శర్మ, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది